కర్ణాటకలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లే బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఓటర్లకు నమోదు ఫారాలు అందజేసి తిరిగి సేకరిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వి. అన్బు కుమార్ తెలిపారు. ఈ దశలో ఎలాంటి గుర్తింపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జూలై 29 వరకు సర్వే కొనసాగనుండగా, ఆగస్టు 5న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్ 7న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఓటర్ల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎన్నికల అధికారులు తెలిపారు.

కర్ణాటకలో ఓటర్ల ప్రత్యేక సవరణ.. ఇంటింటి సర్వేకు పత్రాలు అవసరం లేదు