కడప జిల్లాలో గంజా, సారా, అక్రమ మద్యం నిర్మూలనలో సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల పులివెందుల పోలీసులు 15కిలోల గంజా, 110 లీటర్ల నాటు సారా పట్టుకొని, 18 మందిని అరెస్టు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలపై ప్రతిరోజు పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు.
వాటిని నివారించాల్సిన ఎక్సైజ్ అధికారులకు గంజా సారా, అక్రమ మద్యంతో లింకులున్నాయనే ఆరోపణలున్నాయి.


