కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట పంచాయతీ పరిధిలోని డి.అగ్రహారం గ్రామంలో ఓటర్ల జాబితా లిమిటేషన్ ప్రక్రియపై ఓటర్లకు విస్తృత అవగాహన కల్పించారు.
మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు బ్రహ్మంగారిమఠం తెలుగుదేశం పార్టీ టిడిపి అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి సూచనల మేరకు గురువారం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్లతో (బిఎల్ఓ) కలిసి ఓటర్లకు లిమిటేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.అనంతరం ఓటర్ల జాబితా సవరణలు, చేర్పులకు సంబంధించిన అధికారిక ఫారాలను ఓటర్లకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కానాల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, జాబితాలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ వో లు ఝాన్సీ, కళావతి, స్థానిక నాయకులు, బూత్ ఇంచార్జ్ రామచంద్ర పెరుగు నాగేంద్ర, చంద్ర, కొట్టాల శివ యాదవ్,
కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


