Saturday, 8 August 2026
  • Home  
  • ఓఎన్‌జీసీ సీఎస్‌ఆర్ నిధులతో వాకింగ్ ట్రాక్, కంచె ఏర్పాటు, సుందరీకరణ పనులకు శంకుస్థాపన
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఓఎన్‌జీసీ సీఎస్‌ఆర్ నిధులతో వాకింగ్ ట్రాక్, కంచె ఏర్పాటు, సుందరీకరణ పనులకు శంకుస్థాపన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని పోలమ్మ చెరువుగట్టు వద్ద ఓఎన్‌జీసీ సీఎస్‌ఆర్ నిధులతో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్, కంచె ఏర్పాటు మరియు ఇతర సుందరీకరణ పనులకు సోమవారం శాసనసభ విప్ మరియు ముమ్మిశడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఓఎన్‌జీసీ కాకినాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు అసెట్ మేనేజర్ ప్రభల్‌సేన్ గుప్తాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధికి ఓఎన్‌జీసీ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) నిధుల ద్వారా అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనలో ఓఎన్‌జీసీ భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషకరమని అన్నారు.అదేవిధంగా, ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా తమ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ ముమ్మిడివరం నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమగ్ర నీటి సరఫరా మెరుగుదల పధకమునకు (ఏషియన్ ఇంఫ్రాస్త్రక్షర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులు రూ. 191.43 కోట్లతొ చేపట్టబోయే పనికి మరియు (అమృత్ 2.0 నిధులు) రూ.15.91 కోట్లు మరియు ఒక కోటి రూ. ల తొ చేపట్టబోయే వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి శంఖుస్థాపన మరియు మాజీ లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి గారి విగ్రహావిష్కరణను శాసనసభ్యులు మరియు శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో శాసనసభ్యులు వారు మాట్లాడుతూ గతం లో  AIIB ప్రాజెక్ట్ ద్వారా  110 కోట్లతో శాంక్షన్ చేయించామని గత ప్రభుత్వం ఆ పధకాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని ఇప్పుడు మరలా సుమారు రూ. 206 కోట్లతో దవళేశ్వరం నుండి ముమ్మిడివరం నగర పంచాయతి నకు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుందని ఈ పధకం ద్వారా 5 లక్షల లీటర్ల కెపాసిటి గల 5 ఓవర్ హెడ్ ట్యాంక్ ల నిర్మాణం, 20 వార్డులలో పైప్ లైన్ నిర్మాణం చేపట్టి ప్రజలందరికీ త్రాగు నీరు అందిస్తామని, సుమారు రూ. 3 కోట్లతో సి.సి.రోడ్ల నిర్మాణం చేపట్టామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి.రవివర్మ, నియోజక వర్గ పరిశీలకురాలు సుంకర పావని , గోలకోటి దొరబాబు, తాడి నరసింహారావు, గుద్దటి జమ్మి , బి.జే.పి.జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, దాట్ల పృథ్విరాజు , ఇ.ఇ. రెడ్డి శేషగిరిరావు , డి.ఇ. ఎం.టి.హుస్సేన్ , ములపర్తి బాల కృష్ణ, అర్దాని శ్రీను , వీళ్ళ వీరాస్వామి నాయుడు, దొమ్మేటి రమణ కుమార్ , పిల్లి నాగరాజు , మెండి కమల , బొక్క రుక్మిణి , వాసంశెట్టి అమ్మాజీ , పెదపూడి రుక్మిణి , సరిపెల్ల శ్రీను రాజు , గొల్లపల్లి గోపి ,  కర్రా దుర్గ ప్రసాద్ , తాడి జానకి రామ్ , దాట్లబాబు ,  ఎన్.శ్రినురాజు, ర్యాలి ప్రసాద్, కాశి లాజర్, సానబోయిన సోమయ్య ,  ప్రజలు , నగర పంచాయతి మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని పోలమ్మ చెరువుగట్టు వద్ద ఓఎన్‌జీసీ సీఎస్‌ఆర్ నిధులతో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్, కంచె ఏర్పాటు మరియు ఇతర సుందరీకరణ పనులకు సోమవారం శాసనసభ విప్ మరియు ముమ్మిశడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఓఎన్‌జీసీ కాకినాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు అసెట్ మేనేజర్ ప్రభల్‌సేన్ గుప్తాతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధికి ఓఎన్‌జీసీ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) నిధుల ద్వారా అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనలో ఓఎన్‌జీసీ భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషకరమని అన్నారు.అదేవిధంగా, ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా తమ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ ముమ్మిడివరం నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమగ్ర నీటి సరఫరా మెరుగుదల పధకమునకు (ఏషియన్ ఇంఫ్రాస్త్రక్షర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులు రూ. 191.43 కోట్లతొ చేపట్టబోయే పనికి మరియు (అమృత్ 2.0 నిధులు) రూ.15.91 కోట్లు మరియు ఒక కోటి రూ. ల తొ చేపట్టబోయే వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి శంఖుస్థాపన మరియు మాజీ లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి గారి విగ్రహావిష్కరణను శాసనసభ్యులు మరియు శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో శాసనసభ్యులు వారు మాట్లాడుతూ గతం లో  AIIB ప్రాజెక్ట్ ద్వారా  110 కోట్లతో శాంక్షన్ చేయించామని గత ప్రభుత్వం ఆ పధకాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని ఇప్పుడు మరలా సుమారు రూ. 206 కోట్లతో దవళేశ్వరం నుండి ముమ్మిడివరం నగర పంచాయతి నకు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుందని ఈ పధకం ద్వారా 5 లక్షల లీటర్ల కెపాసిటి గల 5 ఓవర్ హెడ్ ట్యాంక్ ల నిర్మాణం, 20 వార్డులలో పైప్ లైన్ నిర్మాణం చేపట్టి ప్రజలందరికీ త్రాగు నీరు అందిస్తామని, సుమారు రూ. 3 కోట్లతో సి.సి.రోడ్ల నిర్మాణం చేపట్టామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి.రవివర్మ, నియోజక వర్గ పరిశీలకురాలు సుంకర పావని , గోలకోటి దొరబాబు, తాడి నరసింహారావు, గుద్దటి జమ్మి , బి.జే.పి.జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, దాట్ల పృథ్విరాజు , ఇ.ఇ. రెడ్డి శేషగిరిరావు , డి.ఇ. ఎం.టి.హుస్సేన్ , ములపర్తి బాల కృష్ణ, అర్దాని శ్రీను , వీళ్ళ వీరాస్వామి నాయుడు, దొమ్మేటి రమణ కుమార్ , పిల్లి నాగరాజు , మెండి కమల , బొక్క రుక్మిణి , వాసంశెట్టి అమ్మాజీ , పెదపూడి రుక్మిణి , సరిపెల్ల శ్రీను రాజు , గొల్లపల్లి గోపి ,  కర్రా దుర్గ ప్రసాద్ , తాడి జానకి రామ్ , దాట్లబాబు ,  ఎన్.శ్రినురాజు, ర్యాలి ప్రసాద్, కాశి లాజర్, సానబోయిన సోమయ్య ,  ప్రజలు , నగర పంచాయతి మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.