Monday, 7 September 2026
  • Home  
  • ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
- ఎన్ టి ఆర్ జిల్లా

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం

. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం – అమలవుతున్న పథకాలపై సమీక్ష.. మరింత మెరుగైన ఫలితాల కోసం కార్యాచరణపై చర్చ.. అమరావతి: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు, డీఎస్‍బీవీ స్వామి, సంధ్యారాణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయా అనే అంశాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, సామాజిక భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి తదితర రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వారి అభ్యున్నతికి అవసరమైన కొత్త కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలపై కూడా సమావేశంలో సమాలోచనలు జరిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ, సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సమావేశం స్పష్టం చేసింది.

.

సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం – అమలవుతున్న పథకాలపై సమీక్ష.. మరింత మెరుగైన ఫలితాల కోసం కార్యాచరణపై చర్చ..

అమరావతి: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు, డీఎస్‍బీవీ స్వామి, సంధ్యారాణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయా అనే అంశాలపై చర్చించారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, సామాజిక భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి తదితర రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వారి అభ్యున్నతికి అవసరమైన కొత్త కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలపై కూడా సమావేశంలో సమాలోచనలు జరిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ, సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సమావేశం స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.