Wednesday, 22 July 2026
  • Home  
  • ఎస్వీ యూ సర్కిల్ నూతన సీఐని కలిసి న టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్
- తిరుపతి

ఎస్వీ యూ సర్కిల్ నూతన సీఐని కలిసి న టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్

పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 21 తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సర్కిల్‌కు ఇటీవల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన నరేష్ ని టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు, ఎంఆర్పల్లి కో-క్లస్టర్ ఇన్‌చార్జ్ కొట్టే హేమంత్ రాయల్ మర్యాద పూర్వకం గా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్ష లు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల పరిసరాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా విద్యార్థుల భద్రత, విద్యాసంస్థల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం వంటి అంశాలను సీఐ నరేష్ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ మర్యాదపూర్వక భేటీలో విద్యార్థుల సంక్షేమం, ప్రజా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పరస్పర సహకారంతో పనిచేయాలని ఇరువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జ్ఞానేష్ రెడ్డి, సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 21

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సర్కిల్‌కు ఇటీవల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన నరేష్ ని టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు, ఎంఆర్పల్లి కో-క్లస్టర్ ఇన్‌చార్జ్ కొట్టే హేమంత్ రాయల్ మర్యాద పూర్వకం గా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్ష లు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల పరిసరాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా విద్యార్థుల భద్రత, విద్యాసంస్థల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం వంటి అంశాలను సీఐ నరేష్ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ మర్యాదపూర్వక భేటీలో విద్యార్థుల సంక్షేమం, ప్రజా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పరస్పర సహకారంతో పనిచేయాలని ఇరువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జ్ఞానేష్ రెడ్డి, సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.