వార్త ముఖ్యాంశాలు
- భూ భారతి చట్టం ప్రకారం విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు యువ రైతు శ్రీనివాస్ డిమాండ్.
- 8 ఏళ్లుగా తప్పుడు నివేదికలతో వేధిస్తున్నారంటూ ఆరోపణ సమస్య పరిష్కరించకపోతే రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నాకు హెచ్చరిక ఆసిఫాబాద్, అక్టోబర్ 8: భూ వివాదం విషయంలో ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చి, అడ్వకేట్ సమక్షంలో అఫిడవిట్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం…
- ఈ మేరకు 04-05-2026న ప్రజావాణి కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
భూ భారతి చట్టం ప్రకారం విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు యువ రైతు శ్రీనివాస్ డిమాండ్.
8 ఏళ్లుగా తప్పుడు నివేదికలతో వేధిస్తున్నారంటూ ఆరోపణ
సమస్య పరిష్కరించకపోతే రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నాకు హెచ్చరిక
ఆసిఫాబాద్, అక్టోబర్ 8:
భూ వివాదం విషయంలో ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చి, అడ్వకేట్ సమక్షంలో అఫిడవిట్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు 04-05-2026న ప్రజావాణి కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ ఫిర్యాదుపై రెబ్బెన తహసీల్దార్ స్పందిస్తూ, తాను పేర్కొన్న భూములు ఖాస్ర పహాణి ప్రకారం సర్కారీ ఖారిజు ఖాతాగా నమోదై, ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్నందున అసైన్మెంట్ భూములకు మ్యుటేషన్ చేయడం సాధ్యం కాదని నివేదిక ఇచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు. అయితే, ఆ నివేదిక వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిశీలించకుండా ఇచ్చినదని ఆయన ఆరోపించారు.
భూ భారతి చట్టం ప్రకారం విచారణ చేయాలి
ఈ నేపథ్యంలో భూ భారతి చట్టం–2025లోని సెక్షన్ 4 ప్రకారం ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి, సమగ్ర విచారణ నిర్వహించి, సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించాలని కోరుతూ 24-09-2026న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌కు మరోసారి దరఖాస్తు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.
దరఖాస్తు చేసి దాదాపు 15 రోజులు గడుస్తున్నప్పటికీ రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
8 ఏళ్లుగా సమస్య పరిష్కారం కాలేదు
గత 8 సంవత్సరాలుగా భూ సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ, ప్రతిసారీ తప్పుడు నివేదికలతో సమస్యను మరింత జటిలం చేస్తున్నారని దుర్గం శ్రీనివాస్ ఆరోపించారు. ప్రస్తుతం ఇరు వర్గాలు ఏకతాటిపైకి వచ్చి, పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా పట్టా/మ్యుటేషన్ ప్రక్రియ చేపట్టేందుకు రెవెన్యూ అధికారులకు ఎదురవుతున్న ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు.
ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా సమగ్ర విచారణ చేపట్టి భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను కోరారు. సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తే రెబ్బెన రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని శ్రీనివాస్ హెచ్చరించారు.