*కోటికలపూడి సర్పంచ్ అభ్యర్థిగా బండి జ్యోస్ మేరీ – ప్రకటించిన జోగి రమేష్*
ఎన్టీఆర్ జిల్లా.
*ఇబ్రహీంపట్నం, నవంబర్ 13:* స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇబ్రహీంపట్నంలోని మైలవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కోటికలపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని, గ్రామ పార్టీ అధ్యక్షుడిని ప్రకటించారు.
మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ జోగి రమేష్* కోటికలపూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా *శ్రీమతి బండి జ్యోస్ మేరీ ని*, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా
*శ్రీ అర్జా సురేష్*
*ని ప్రకటించారు*.
ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, కోటికలపూడి గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
సర్పంచ్ అభ్యర్థి బండి జ్యోస్ మేరీని, గ్రామ పార్టీ అధ్యక్షుడు అర్జా సురేష్ ను గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

