Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని వృద్ధుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని వృద్ధుడు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు, నవంబరు: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
  • ఈ ఘటనపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటకు చెందిన అరవ రాజమణి, కమలమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు.
  • గతంలో రిక్షా నడుపుతూ జీవనం సాగించిన రాజమణి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు.

నెల్లూరు, నవంబరు: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటకు చెందిన అరవ రాజమణి, కమలమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. గతంలో రిక్షా నడుపుతూ జీవనం సాగించిన రాజమణి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు. నవంబరు 1న నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికి చేరుకున్నారు. అనంతరం కొద్దిసేపటికి భార్య వద్ద రూ.500 తీసుకుని బయటకు వెళ్లారు.అప్పటి నుంచి ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాలతో పాటు నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద కూడా వెతికారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో కుమారుడు రాజ్‌కుమార్ బుధవారం సంతపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *