వార్త ముఖ్యాంశాలు
- తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 11, వార్డులకు 36 నామినేషన్లు కలువాయి, నవంబర్: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది.
- రెండో విడతలో నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది.
- ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సౌకర్యార్థం మండలంలో ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 11, వార్డులకు 36 నామినేషన్లు
కలువాయి, నవంబర్: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. రెండో విడతలో నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సౌకర్యార్థం మండలంలో ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చీపినాపి, కుల్లూరు, కనుపూరుపల్లి, దాచూరు, కలువాయి-1, కలువాయి-2 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు.తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 11, వార్డు సభ్యుల స్థానాలకు 36 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. దాచూరు, కలువాయి-2 కేంద్రాల్లో మాత్రం మొదటిరోజు ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నెల్లూరు డీఎస్పీ చంద్రమౌళి బుధవారం కలువాయిలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల బందోబస్తు కోసం మండలానికి ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 60 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు.మండలంలోని మొత్తం 20 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోటీకి అభ్యర్థులు సిద్ధమవుతుండటంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల గడువు ముగిసేలోగా మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.