Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నామినేషన్ల పరిశీలన కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎస్పీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నామినేషన్ల పరిశీలన కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎస్పీ

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరు, నవంబర్: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న కేంద్రాన్ని కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ బుధవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
  • సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన సందర్భంగా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.144 సెక్షన్ అమలులో ఉన్నందున నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
  • అభ్యర్థులు, వారి అనుచరులు గుంపులుగా కేంద్రానికి చేరకుండా నియంత్రించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు.

వింజమూరు, నవంబర్: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న కేంద్రాన్ని కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ బుధవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన సందర్భంగా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.144 సెక్షన్ అమలులో ఉన్నందున నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు, వారి అనుచరులు గుంపులుగా కేంద్రానికి చేరకుండా నియంత్రించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును పరిశీలించారు. కార్యక్రమంలో వింజమూరు ఎస్సై ఎం. ఉమామహేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *