ఇంటర్ MLT ఒకేషనల్ కోర్సులో 2024 మార్చి నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్లినికల్ శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి బాబు తెలిపారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు రూ.1,000 డీడీ రూపంలో రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని అభ్యర్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీలోగా కలెక్టరేట్లోని DIEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.



