Tuesday, 29 September 2026
  • Home  
  • ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడిన యువకుడు మృతి
- ఖమ్మం

ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడిన యువకుడు మృతి

వారం రోజుల మృత్యుపోరాటం.. ఎస్సై కారు డ్రైవర్ మృతి కాకరవాయి, సెప్టెంబర్ 29: పిండిప్రోలు గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఈనెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్సై కారు డ్రైవర్, కాకరవాయి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాకేష్ మంగళవారం మృతి చెందారు. వినాయక నిమజ్జనం బందోబస్తు విధులు ముగించుకుని ఎస్సైతో కలిసి పోలీసు వాహనంలో వెళ్తున్న సమయంలో భవానీ హోటల్ సమీపంలోని మూలమలుపు వద్ద లారీ పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్‌తో పాటు ఎస్సై కూడా తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను తొలుత ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడిన రాకేష్ మంగళవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాకేష్ మృతితో కాకరవాయి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

వారం రోజుల మృత్యుపోరాటం.. ఎస్సై కారు డ్రైవర్ మృతి

కాకరవాయి, సెప్టెంబర్ 29: పిండిప్రోలు గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఈనెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్సై కారు డ్రైవర్, కాకరవాయి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాకేష్ మంగళవారం మృతి చెందారు.

వినాయక నిమజ్జనం బందోబస్తు విధులు ముగించుకుని ఎస్సైతో కలిసి పోలీసు వాహనంలో వెళ్తున్న సమయంలో భవానీ హోటల్ సమీపంలోని మూలమలుపు వద్ద లారీ పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్‌తో పాటు ఎస్సై కూడా తీవ్రంగా గాయపడ్డారు.

తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను తొలుత ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడిన రాకేష్ మంగళవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

రాకేష్ మృతితో కాకరవాయి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.