ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగస్తుల అసోసియేషన్, నెల్లూరు జాయింట్ యాక్షన్ కమిటీ (ఎన్‌జేఏసీ) ఆధ్వర్యంలో ఆత్మకూరులో స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులతో ఆత్మీయ సభను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్‌జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఎన్‌జేఏసీ పనిచేస్తోందని తెలిపారు. ఉద్యోగులందరూ ఐక్యంగా తమ హక్కుల కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఇదే విధంగా ఆత్మీయ సభలు నిర్వహించి ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని, ప్రతి ఉద్యోగి ఎన్‌జేఏసీ కార్యక్రమాలకు సహకరించాలని వారు కోరారు. స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌జేఏసీ చైర్మన్ ఖాదర్ బాషా, జనరల్ సెక్రటరీ నెల్లూరు శ్రీనివాసులు రెడ్డి, వైస్ చైర్మన్ జైశ్రీ, కో-చైర్మన్ పాండురంగ, పబ్లిసిటీ సెక్రటరీ సహన్తో పాటు ఆత్మకూరు మండలంలోని స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల ఆత్మీయ సభ