కలిగిరి: అసంపూర్తిగా ఉన్న కలిగిరి ప్రధాన రహదారితో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో నిత్యం రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై గుంతలు, అసమతల ప్రాంతాలు, నిర్మాణ సామగ్రి కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అసంపూర్తి రహదారి పనులను పూర్తి చేయాలని కలిగిరి ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు తాత్కాలిక చర్యలు చేపట్టి, రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అసంపూర్తిగా కలిగిరి రోడ్డు.. తరచూ ప్రమాదాలు