డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ ఐజీపీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐ.పి.ఎస్. తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐ.పి.ఎస్.తో పాటు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. స్టేషన్ పరిశుభ్రత, కేసుల దర్యాప్తు వేగం, CEIR వినియోగం, మహిళలు–పిల్లల కేసుల్లో త్వరిత న్యాయం, గంజాయి–మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణపై సూచనలు చేశారు. బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు భద్రత చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, శాంతి కమిటీల ద్వారా సమస్యల పరిష్కారం చేపట్టాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
