విమానాశ్రయంలో స్వాగతం పలికిన
ఎన్ఆర్ఐలు
పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 28
అమెరికా పర్యటన లో ఉన్న చెవిరెడ్డి కుటుంబానికి అక్కడి తెలుగు ఎన్.ఆర్.ఐ విమానాశ్రయంలో సోమవారం ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్ఛాలు అందజేసి ఆత్మీయం గా ఆహ్వానించిన ప్రవాస భారతీయులు, చెవిరెడ్డి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు చెవిరెడ్డి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్ఞాపికలను అందించారు. అమెరికాలోని పలు నగరాల్లో ప్రవాస భారతీయులతో చెవిరెడ్డి కుటుంబం మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.


