వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 7(పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరు పట్టణ మేజర్ పంచాయతీ ఎన్నికల వాతావరణం వేడెక్కు తుంది..
- ముఖ్యంగా పంచాయతీ వార్డు మెంబర్ల పోటీలో యువకుల శాతం ఎక్కువగా ఉండటంతో, తుది జాబితాలో ఎవరికి చోటు కల్పించాలో, అర్ధం కాక మల్లగుళ్ళాలు పడుతున్న పరిస్థితి పామూరు లో నెలకొంది..
- ఈ యువనాయకుల పోటీ జాబితాలో భాగంగా 271 బూత్ ఇంచార్జి, మరియు ఎన్నికల బి.
పామూరు, నవంబర్ 7(పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరు పట్టణ మేజర్ పంచాయతీ ఎన్నికల వాతావరణం వేడెక్కు తుంది.. ముఖ్యంగా పంచాయతీ వార్డు మెంబర్ల పోటీలో యువకుల శాతం ఎక్కువగా ఉండటంతో, తుది జాబితాలో ఎవరికి చోటు కల్పించాలో, అర్ధం కాక మల్లగుళ్ళాలు పడుతున్న పరిస్థితి పామూరు లో నెలకొంది.. ఈ యువనాయకుల పోటీ జాబితాలో భాగంగా 271 బూత్ ఇంచార్జి, మరియు ఎన్నికల బి. యల్. ఓ. అయిన షకీబ్ షైక్,15 వ వార్డు పంచాయతీ మెంబెర్ గా పోటీ చేయడానికి అన్ని విధాలుగా సమర్ధుడని పట్టణ ప్రజల అభిప్రాయం.. ముందునుంచి రాజకీయ చరిత్ర కల్గిన కటుంబం నుంచి రావడం వలన, రాజకీయం మాకు కొత్త కాదని, రాజకీయ వ్యూహ రచన మాకు వెన్నతో పెట్టిన విద్య అని, షకీబ్ అన్నారు.. గత కొంత కాలంగా టీడీపీ నిర్వహించిన పార్టీ కార్యక్రమాల్లో ప్రధాన భూమిక వహించి పార్టీని ముందుకు నడిపిన నాయకుల జాబితా లో ముందంజలో ఉండటం కూడా ఇతనికి కలిసోచ్చే మరో ప్రధాన అంశం… టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ టికెట్ పొందే యువనాయకుల జాబితాలో వున్న వ్యక్తిగా , పార్టీకి విధేయుడుగా,, సౌమ్యుడుగా పార్టీలో పేరు తెచ్చుకున్న షకీబ్ కే 15 వార్డు పట్టం అని పామూరు ప్రజల అభిప్రాయం..