అధికార పక్షానికి తొత్తులుగా మారిన మున్సిపల్ అధికారులు
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం
జీవో 1113 ప్రకారం జరగాల్సిన డోర్-టు-డోర్ ఓటర్ల సర్వే పూర్తిగా బోగస్!
వి. సి. కె పార్టీ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ.
రాబోయే మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును విముక్తి చిరుతల పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. జీవో ఎంఎస్ నెంబర్ 1113 ప్రకారం.. ఈనెల 8వ తేదీ నుండి 12వ తేదీ (ఈరోజు) వరకు అధికారులు ప్రతి వార్డులోనూ పర్యటించి, పారదర్శకంగా డోర్-టు-డోర్ పద్ధతిలో ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), ఓసీ (OC) మరియు మహిళా ఓటర్ల సంఖ్యను లెక్కించాల్సి ఉంది.కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సర్వేకు చివరి రోజైన ఈరోజు వరకు ఏ ఒక్క అధికారి లేదా సిబ్బంది కూడా వార్డుల్లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ప్రజాస్వామ్యాన్ని, క్షేత్రస్థాయి గణాంకాలను పూర్తిగా పక్కన పెట్టేసి, అధికారులు కేవలం ఆఫీసు గదులకే పరిమితమయ్యారు.అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చేందుకే అధికారులు ఈ దొంగచాటు వ్యవహారానికి తెరలేపారు. వార్డుల్లోకి వెళ్లకుండా, కేవలం ఏసీ రూముల్లో కూర్చుని అధికార పక్షానికి అణువుగా రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేయడం నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమే. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అనేక మందిని మేము స్వయంగా విచారించగా, ఎక్కడా కూడా ఎలాంటి సర్వే జరగలేదని స్పష్టమైంది.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల ప్రక్రియను కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ విధంగా ఒక పార్టీకి కొమ్ముకాయడం అత్యంత సిగ్గుచేటు. బడుగు, బలహీన వర్గాల హక్కులకు భంగం కలిగిస్తూ చేస్తున్న ఈ అక్రమ రిజర్వేషన్ల ప్రక్రియను విముక్తి చిరుతల పార్టీ సహించబోదు.ఈ బోగస్ సర్వేపై, నిబంధనల ఉల్లంఘనపై ఉన్నతాధికారులకు మరియు రాష్ట్ర ఎన్నికల సంఘానికి VCK తరపున ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నాం. తక్షణమే ఈ బోగస్ ప్రక్రియను నిలిపివేసి, క్షేత్రస్థాయిలో పారదర్శకంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.
బొంతు రమణ
వి. సి. కె పార్టీ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ.


