అద్దంకిలో జన్మదిన వేడుకలకు హాజరైన ఉమ్మడి ప్రకాశం జిల్లా కౌన్సిలర్లు
అద్దంకి: అద్దంకి మండల కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ప్రమోద్ కుమార్ – సుగన్య గార్ల కుమార్తె క్రిషిత హేజల్ జన్మదిన వేడుకలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు జిల్లా కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు హాజరై చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కనిగిరి మండల కౌన్సిలర్ డా. కె.టి.సి. పాపారాయుడు, వెలిగండ్ల మండల కౌన్సిలర్ పద్మ, నాగులుప్పలపాడు మండల కౌన్సిలర్ రాజేష్, హనుమంతునిపాడు మండల కౌన్సిలర్ నవీన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుక ఆత్మీయ వాతావరణంలో జరిగింది.


