వార్త ముఖ్యాంశాలు
- పామూరు గ్రామం లో సి.
- యస్.
- పురం రోడ్డులో వెలసిన కొంగు బంగారం, అన్ని మతాల భక్తుల ఆరాధ్య దేవుడు శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని 50 వ గంధ మహోత్సవం ఈ నెల 23 శుక్రవారం అంగరంగ వైభవం గా జరుగుతుంది..ఈ సందర్బంగా దర్గా కమిటీ, మరియు యూత్ కమిటీ…
పామూరు గ్రామం లో సి. యస్. పురం రోడ్డులో వెలసిన కొంగు బంగారం, అన్ని మతాల భక్తుల ఆరాధ్య దేవుడు శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని 50 వ గంధ మహోత్సవం ఈ నెల 23 శుక్రవారం అంగరంగ వైభవం గా జరుగుతుంది..ఈ సందర్బంగా దర్గా కమిటీ, మరియు యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామి వారి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్న కార్యక్రమం జయప్రదం చేసి మహబూబ్ సుభాని దీవెనలు పొందాలని కోరారు.. గత 50 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం తేడా లేకుండా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.23,24 తేదీలలో రెండు రోజులు జరిగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమం వివరాలు దర్గా కమిటీ సభ్యులు తెలియ చేశారు.23 వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం మరియు అదే రోజు సాయంత్రం 8 గంటలకు సయ్యద్ మహబూబ్ పీరా గారి ఇంటి వద్ద నుంచి విద్యుత్ దీపాలంకరణ, మేళతాలాలతో, ఫకీర్ల గాన భజానాలతో స్వామి వారి జెండా గర్గా కు చేరుతుందని కమిటీ సభ్యులు తెలిపారు..అనంతరం రాత్రి 10 గంటలకు నెల్లూరు కోకిల ఈవెంట్స్ వారిచే గొప్ప పాట కచేరి నిర్వహించబడును. 24వ తేదీ తెల్లవారుజామున సయ్యద్ గౌస్ బాషా గారి ఇంటి వద్ద నుంచి మేళతాలాలతో, కరెంట్ డేజారేషన్ లతో, ఫకిర్ల గానాలాపనతో గంధం గర్గాకు చేరును..చివరగా భక్తులకు తాంబూల ప్రసాదాలు పంచబడును.50 వ గాంధమహోత్చావం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు, మరియు ముస్లిం సోదరులు కోరారు.