వార్త ముఖ్యాంశాలు
- బీసీ మహిళకు రిజర్వు కావడంతో జంగాలపల్లి గ్రామస్తులతో దారపనేని సమీక్ష పామూరు: తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో జంగాలపల్లి గ్రామస్తులతో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
- సర్పంచ్ అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతున్న మానం మల్లికార్జునరావు, బొడ్డు వెంకటేశ్వరరావు తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు.
- ఈ విషయాన్ని కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయన నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని దారపనేని పేర్కొన్నారు.
బీసీ మహిళకు రిజర్వు కావడంతో జంగాలపల్లి గ్రామస్తులతో దారపనేని సమీక్ష
పామూరు: తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో జంగాలపల్లి గ్రామస్తులతో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతున్న మానం మల్లికార్జునరావు, బొడ్డు వెంకటేశ్వరరావు తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయన నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని దారపనేని పేర్కొన్నారు. ఇద్దరూ తమ కుటుంబ సభ్యులేనని, ఎమ్మెల్యే ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా అందరం ఐక్యంగా పనిచేసి గెలిపిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్, మిరియం సుబ్బరాయుడు, తిరివీధి చంద్ర, మక్కా నాగరాజు, బొడ్డు రవి, బొడ్డు దానమయ్య, బొడ్డు సుధాకర్, చెనికల మల్లికార్జున, బొడ్డు పెద్దదానమయ్య, బొడ్డు వినోద్, బొడ్డు తిరుపతిరావు, నాగం నాగరాజు, మానం వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.