Thursday, 24 September 2026
  • Home  
  • అక్రమ షెడ్లకు అడ్డూ అదుపూ లేదా..? ఆటోనగర్‌లో అనుమతులు లేకుండానే భారీ షెడ్డు నిర్మాణం?
- తెలంగాణ

అక్రమ షెడ్లకు అడ్డూ అదుపూ లేదా..? ఆటోనగర్‌లో అనుమతులు లేకుండానే భారీ షెడ్డు నిర్మాణం?

అక్రమ షెడ్లకు అడ్డూ అదుపూ లేదా..? ఆటోనగర్‌లో అనుమతులు లేకుండానే భారీ షెడ్డు నిర్మాణం? ఎల్బీనగర్‌ జోన్‌ అధికారుల తీరుపై విమర్శలు వనస్థలిపురం, ఆగస్టు 10: ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్‌లో అనుమతులు లేకుండానే భారీ షెడ్డు నిర్మాణం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేకులు, ఇనుప నిర్మాణాలతో చేపడుతున్న ఈ షెడ్డు నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నా సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నపాటి నిర్మాణాలపైనా నిబంధనల పేరుతో చర్యలు తీసుకునే అధికారులు.. ప్రధాన రహదారికి ఆనుకుని భారీ షెడ్డు నిర్మాణం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే నోటీసులు జారీ చేసి, అవసరమైతే కూల్చివేత చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూస్తున్నారా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి షెడ్డుకు సంబంధించిన అనుమతులు, నిర్మాణ నిబంధనలు, వినియోగ అనుమతి తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్మాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

అక్రమ షెడ్లకు అడ్డూ అదుపూ లేదా..?

ఆటోనగర్‌లో అనుమతులు లేకుండానే భారీ షెడ్డు నిర్మాణం?

ఎల్బీనగర్‌ జోన్‌ అధికారుల తీరుపై విమర్శలు

వనస్థలిపురం, ఆగస్టు 10:
ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్‌లో అనుమతులు లేకుండానే భారీ షెడ్డు నిర్మాణం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేకులు, ఇనుప నిర్మాణాలతో చేపడుతున్న ఈ షెడ్డు నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నా సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నపాటి నిర్మాణాలపైనా నిబంధనల పేరుతో చర్యలు తీసుకునే అధికారులు.. ప్రధాన రహదారికి ఆనుకుని భారీ షెడ్డు నిర్మాణం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే నోటీసులు జారీ చేసి, అవసరమైతే కూల్చివేత చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూస్తున్నారా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి షెడ్డుకు సంబంధించిన అనుమతులు, నిర్మాణ నిబంధనలు, వినియోగ అనుమతి తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్మాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.