ఖమ్మం ఆగష్టు 6
(పున్నమి న్యూస్)
ఖమ్మం: నాటి మున్సిపల్ పాలకవర్గ హయాంలో జరిగిన అక్రమాలను అఖిలపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో పరిశీలించి ప్రశ్నించినందుకు తమపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని తెలుగు యువత నాయకుడు నల్లమల రంజిత్ పేర్కొన్నారు. ఆ కేసులో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా కోర్టుకు రంజిత్ హాజరయ్యారు. ఇదే కేసులో అప్పటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్‌పై కూడా కేసు నమోదైనట్లు తెలిపారు. నిజాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.



