Friday, 25 September 2026
  • Home  
  • గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ ‘ప్రణాళిక :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- జనగాం

గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ ‘ప్రణాళిక :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ’ ప్రణాళిక:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————————————————————- గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను సమర్థంగా అమలు చేయాలి ఎల్నినో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ జలసిరి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి* వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల అమలుపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన వీబీజీ–రామ్‌జీ 125 రోజుల ఉపాధి పని గ్యారంటీ, ఎల్నినో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళిక, తెలంగాణ జలసిరి పనులపై బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట్ట, జనగామ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు *వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ తయారీ, అమలు* శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో బావులు, బోర్‌ వెల్, ఇరిగేషన్ ఛానళ్లు, డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ల నిర్మాణం, స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, బోర్‌ వెల్ వాటర్ ఆటోమేషన్ సెన్సర్ల ఏర్పాటు వంటి పనులను చేపట్టవచ్చని తెలిపారు. అలాగే చెక్‌ డ్యామ్‌లు, రీఛార్జ్ పిట్లు, చెరువుల పునరుద్ధరణ, అండర్‌ గ్రౌండ్ డైక్స్ వంటి నీటి సంరక్షణ నిర్మాణాలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామీణ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు, క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్లు, ఫుట్ ఓవర్ పాత్‌ వేలు, పెవర్ బ్లాక్ ఫుట్‌పాత్‌లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, ల్యాబొరేటరీలు, కాంపౌండ్ వాల్లు, క్రీడా మైదానాల నిర్మాణం, మరమ్మతులు కూడా ఈ పథకం ద్వారా చేపట్టవచ్చని వివరించారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, వ్యక్తిగత, కమ్యూనిటీ సోక్‌ పిట్లు, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్ యూనిట్లు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ చాంబర్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్, రీసైక్లింగ్ ప్లాంట్లు, చెత్త సేకరణ పిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు, బయో ఫర్టిలైజర్ స్టోరేజ్ యూనిట్లు, బయోగ్యాస్ ప్లాంట్లు, సోలార్ లైట్లు ఏర్పాటు వంటి పనులను కూడా చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖ, మిషన్ భగీరథ, తదితర శాఖల అధికారులు గ్రామాల అవసరాలకు అనుగుణంగా సర్పంచులతో సమన్వయం చేసుకొని పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. కూలీల సమీకరణకు ప్రాధాన్యత ఇచ్చి గ్రామాభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయం, నీటి సంరక్షణ, ఉద్యానవనం, అటవీకరణ, గ్రామీణ రహదారులు, డ్రైనేజీలు, కల్వర్టులు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రీసైక్లింగ్ ప్లాంట్లు, బయోగ్యాస్ ప్లాంట్లు, సోలార్ లైట్లు, తదితర అనేక అభివృద్ధి పనులను గ్రామ పంచాయతీలు చేపట్టవచ్చని తెలిపారు. గ్రామాల అవసరాలను గుర్తించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పనులను ఎంపిక చేసుకోవాలని, కొత్త నిర్మాణాలతో పాటు ఇప్పటికే ఉన్న మౌలిక వసతులకు మరమ్మతులు, నిర్వహణ పనులను కూడా చేపట్టవచ్చని చెప్పారు. గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా వీబీజీ–రామ్‌జీ పథకం కింద 125 రోజుల పనులను సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. ఎల్‌నినో కారణంగా తలెత్తే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ పనులు, చెరువుల పునరుద్ధరణ, చెక్‌ డ్యాంలు, రీచార్జ్ పిట్లు, డ్రిప్ ఇరిగేషన్, ప్లాంటేషన్ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని కార్యాచరణ ప్రణాళికలను సమర్థంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. దీని కింద వెదురు, మ్యాంగ్రోవ్, మియావాకి, కొబ్బరి, రబ్బర్, బయో డ్రైనేజ్, బ్రూమ్, తదితర మొక్కల పెంపకాన్ని చేపట్టవచ్చని చెప్పారు. అదే విధంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై చేపట్టగల వివిధ పనులపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించి, అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డీఆర్‌డీఓ భాస్కర్, అదనపు డీఆర్‌డీఓ సూరి, ఎఫ్‌ఆర్‌ఓ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీపీఓ వెంకట్‌ రెడ్డి, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, డీవీహెచ్‌ఓ మురళీధర్ రావు, ఈఈ పీఆర్ రవీందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్, డీహెచ్‌ఎస్‌ఓ నర్సయ్య, బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట్ట, జనగామ మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ’ ప్రణాళిక:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
———————————————————————-
గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను సమర్థంగా అమలు చేయాలి
ఎల్నినో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ జలసిరి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి*
వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల అమలుపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన వీబీజీ–రామ్‌జీ 125 రోజుల ఉపాధి పని గ్యారంటీ, ఎల్నినో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళిక, తెలంగాణ జలసిరి పనులపై బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట్ట, జనగామ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు *వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ తయారీ, అమలు* శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
గ్రామాల్లో బావులు, బోర్‌ వెల్, ఇరిగేషన్ ఛానళ్లు, డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ల నిర్మాణం, స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, బోర్‌ వెల్ వాటర్ ఆటోమేషన్ సెన్సర్ల ఏర్పాటు వంటి పనులను చేపట్టవచ్చని తెలిపారు. అలాగే చెక్‌ డ్యామ్‌లు, రీఛార్జ్ పిట్లు, చెరువుల పునరుద్ధరణ, అండర్‌ గ్రౌండ్ డైక్స్ వంటి నీటి సంరక్షణ నిర్మాణాలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు.
గ్రామీణ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు, క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్లు, ఫుట్ ఓవర్ పాత్‌ వేలు, పెవర్ బ్లాక్ ఫుట్‌పాత్‌లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, ల్యాబొరేటరీలు, కాంపౌండ్ వాల్లు, క్రీడా మైదానాల నిర్మాణం, మరమ్మతులు కూడా ఈ పథకం ద్వారా చేపట్టవచ్చని వివరించారు.
రైతు వేదికలు, వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, వ్యక్తిగత, కమ్యూనిటీ సోక్‌ పిట్లు, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్ యూనిట్లు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ చాంబర్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్, రీసైక్లింగ్ ప్లాంట్లు, చెత్త సేకరణ పిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు, బయో ఫర్టిలైజర్ స్టోరేజ్ యూనిట్లు, బయోగ్యాస్ ప్లాంట్లు, సోలార్ లైట్లు ఏర్పాటు వంటి పనులను కూడా చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు.
ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖ, మిషన్ భగీరథ, తదితర శాఖల అధికారులు గ్రామాల అవసరాలకు అనుగుణంగా సర్పంచులతో సమన్వయం చేసుకొని పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. కూలీల సమీకరణకు ప్రాధాన్యత ఇచ్చి గ్రామాభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.
వ్యవసాయం, నీటి సంరక్షణ, ఉద్యానవనం, అటవీకరణ, గ్రామీణ రహదారులు, డ్రైనేజీలు, కల్వర్టులు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రీసైక్లింగ్ ప్లాంట్లు, బయోగ్యాస్ ప్లాంట్లు, సోలార్ లైట్లు, తదితర అనేక అభివృద్ధి పనులను గ్రామ పంచాయతీలు చేపట్టవచ్చని తెలిపారు.
గ్రామాల అవసరాలను గుర్తించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పనులను ఎంపిక చేసుకోవాలని, కొత్త నిర్మాణాలతో పాటు ఇప్పటికే ఉన్న మౌలిక వసతులకు మరమ్మతులు, నిర్వహణ పనులను కూడా చేపట్టవచ్చని చెప్పారు.
గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా వీబీజీ–రామ్‌జీ పథకం కింద 125 రోజుల పనులను సమర్థంగా అమలు చేయాలని తెలిపారు.
ఎల్‌నినో కారణంగా తలెత్తే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ పనులు, చెరువుల పునరుద్ధరణ, చెక్‌ డ్యాంలు, రీచార్జ్ పిట్లు, డ్రిప్ ఇరిగేషన్, ప్లాంటేషన్ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని కార్యాచరణ ప్రణాళికలను సమర్థంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
దీని కింద వెదురు, మ్యాంగ్రోవ్, మియావాకి, కొబ్బరి, రబ్బర్, బయో డ్రైనేజ్, బ్రూమ్, తదితర మొక్కల పెంపకాన్ని చేపట్టవచ్చని చెప్పారు.
అదే విధంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై చేపట్టగల వివిధ పనులపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించి, అవగాహన కల్పించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో డీఆర్‌డీఓ భాస్కర్, అదనపు డీఆర్‌డీఓ సూరి, ఎఫ్‌ఆర్‌ఓ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీపీఓ వెంకట్‌ రెడ్డి, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, డీవీహెచ్‌ఓ మురళీధర్ రావు, ఈఈ పీఆర్ రవీందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్, డీహెచ్‌ఎస్‌ఓ నర్సయ్య, బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట్ట, జనగామ మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.