ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం రేణమాల గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ‘గడప గడపకు బీఎస్పీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సామాజిక సమానత్వం, హక్కులు, రాజ్యాంగ విలువలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యపరిచేందుకు కృషి చేశారు. ప్రజలు తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు రావాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జి క్రాకుటూరు పుష్పాంజలి, జిల్లా కార్యదర్శి బెజవాడ ప్రకాశరావు, జిల్లా బీవీఎఫ్ కన్వీనర్ ఏడుకొండలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రేణమాలలో గడప గడపకు బీఎస్పీ