Sunday, 27 September 2026
  • Home  
  • ముక్కామల–ఈదరపల్లి రోడ్డుపై నెలకే నాణ్యత డొల్లతనం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముక్కామల–ఈదరపల్లి రోడ్డుపై నెలకే నాణ్యత డొల్లతనం

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముక్కామల–ఈదరపల్లి ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయి నెల రోజులు కూడా కాకముందే నాణ్యత సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కాలువ వైపున ఏర్పాటు చేసిన కాంక్రీట్ అప్రోచ్ పగుళ్లకు గురికాగా, రహదారి ఒక వైపు పూర్తిగా దిగిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యత లేని మెటీరియల్ వినియోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి రహదారి పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాల ప్రకారం మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Uploaded Video:

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముక్కామల–ఈదరపల్లి ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయి నెల రోజులు కూడా కాకముందే నాణ్యత సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కాలువ వైపున ఏర్పాటు చేసిన కాంక్రీట్ అప్రోచ్ పగుళ్లకు గురికాగా, రహదారి ఒక వైపు పూర్తిగా దిగిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యత లేని మెటీరియల్ వినియోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి రహదారి పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాల ప్రకారం మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.