ఖమ్మం: అనారోగ్యంతో కాలు కోల్పోయిన ఆటో కార్మికుడు రేపాకుల మహేష్‌కు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు అందజేశారు. మాజీ శాసన మండలి సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు సహకారంతో నాగ్‌పూర్ నుంచి కృత్రిమ కాలును తెప్పించారు. మమత హాస్పిటల్ డైరెక్టర్ పువ్వాడ నరేన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కృత్రిమ కాలు అందించడంతో మహేష్‌కు నడిచేందుకు, తన దైనందిన పనులు చేసుకునేందుకు సహాయపడనుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహేష్‌కు ఫౌండేషన్ అందించిన సహకారం కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపింది.



