Wednesday, 30 September 2026
  • Home  
  • బి.జె.పి ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు.
- తూర్పు గోదావరి

బి.జె.పి ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు:భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవకు గుర్తుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు కార్యకర్తలు కొవ్వూరు పట్టణంలోని బాపూజీ నగర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి మొక్కలు నాటారు. అనంతరం అల్లూరి నాగరత్నం బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు ‘ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు వలన కలిగే నష్టాలను’ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ.. స్వచ్ఛ్ భారత్ నినాదాన్ని ప్రతీ రోజూ జీవితంలో భాగస్వామ్యం చేసుకుని మనం నివాసం ఉంటున్న ఇంటితోపాటు పరిసర ప్రాంతాలను, ఊరుని పరిశుభ్రంగా ఉంచే విషయంలో విద్యార్థులు యువత ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను ఎక్కువగా నాటాలని కోరుతున్నాను. ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే నష్టాలతో* ప్రపంచ సంక్షోభం స్థితిలోకి వెళ్ళింది. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువుల వలన స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పాడవడంతోపాటు త్రాగునీరు, ఆహార పదార్థాల కలుషితంతో మానవాళికి, నది సముద్ర జలాలు కలుషితం కావడంతోపాటు జలచర జీవులకి పెను ముప్పు పొంచి ఉంది. వాతావరంలో వచ్చిన మార్పుల వలన జరుగుతున్న నష్టాలను కూడా మనం చూస్తున్నాము. అనుభవిస్తున్నాము. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ‘ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను’ ఎట్టిపరిస్థితుల్లోనూ అరికట్టాలి. పాలిథిన్ కవర్ల స్థానంలో కాటన్ సంచులను వాడాలి. ప్లాస్టిక్ త్రాగునీరు బాటిళ్లను విడనాడాలి. జలాశయాలలోప్లాస్టిక్వస్తువులువాడ కూడదు. పరిశుభ్రం, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడం అంశాలలో విద్యార్థులు యువత ప్రజలు చైతన్యం కావాలని కోరుతున్నానని పిక్కి నాగేంద్ర అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లలమర్రి మురళీకృష్ణ, పట్టణ అధ్యక్షులు చెరుకూరి సాయి రామకృష్ణంరాజు, జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ముత్యాలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మడిచర్ల రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ఆలపాటి రామకృష్ణ, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు బెనుగు రమేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మావతి, సి.హెచ్. దేవి కృష్ణ, సింగిరి సాయి.. తదితరులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు:భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవకు గుర్తుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు కార్యకర్తలు కొవ్వూరు పట్టణంలోని బాపూజీ నగర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి మొక్కలు నాటారు. అనంతరం అల్లూరి నాగరత్నం బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు ‘ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు వలన కలిగే నష్టాలను’ వివరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ..
స్వచ్ఛ్ భారత్ నినాదాన్ని ప్రతీ రోజూ జీవితంలో భాగస్వామ్యం చేసుకుని మనం నివాసం ఉంటున్న ఇంటితోపాటు పరిసర ప్రాంతాలను, ఊరుని పరిశుభ్రంగా ఉంచే విషయంలో విద్యార్థులు యువత ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను ఎక్కువగా నాటాలని కోరుతున్నాను.
ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే నష్టాలతో* ప్రపంచ సంక్షోభం స్థితిలోకి వెళ్ళింది. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువుల వలన స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పాడవడంతోపాటు త్రాగునీరు, ఆహార పదార్థాల కలుషితంతో మానవాళికి, నది సముద్ర జలాలు కలుషితం కావడంతోపాటు జలచర జీవులకి పెను ముప్పు పొంచి ఉంది. వాతావరంలో వచ్చిన మార్పుల వలన జరుగుతున్న నష్టాలను కూడా మనం చూస్తున్నాము. అనుభవిస్తున్నాము. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ‘ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను’ ఎట్టిపరిస్థితుల్లోనూ అరికట్టాలి. పాలిథిన్ కవర్ల స్థానంలో కాటన్ సంచులను వాడాలి. ప్లాస్టిక్ త్రాగునీరు బాటిళ్లను విడనాడాలి. జలాశయాలలోప్లాస్టిక్వస్తువులువాడ కూడదు.
పరిశుభ్రం, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడం అంశాలలో విద్యార్థులు యువత ప్రజలు చైతన్యం కావాలని కోరుతున్నానని పిక్కి నాగేంద్ర అన్నారు

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లలమర్రి మురళీకృష్ణ, పట్టణ అధ్యక్షులు చెరుకూరి సాయి రామకృష్ణంరాజు, జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ముత్యాలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మడిచర్ల రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ఆలపాటి రామకృష్ణ, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు బెనుగు రమేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మావతి, సి.హెచ్. దేవి కృష్ణ, సింగిరి సాయి.. తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.