కావలి నియోజకవర్గంలోని చర్మ కార్మికులు డప్పు కళాకారులు కు పింఛన్ల విషయంలో మాదిగలకు న్యాయం చేయాలని కోరుతూ ఎం ఆర్ పి ఎస్ నాయకులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి వినత పత్రం అందజేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలు మరియు మంద వెంకటేశ్వరరావు సూచనలతో చేవూరు కిరణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు తరతరాలుగా చెప్పులు కొట్టడం డబ్బులు తయారు చేయటం వాయించటం వంటి వ్యక్తులపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన వృత్తిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. తమ వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పింఛన్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి శ్రీనివాసులు మాదిగ, పరుసు వెంకటేశ్వర్లు మాదిగ, పందిటి రాజ్ కుమార్ మాదిగ, మావులూరి సాల్మన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు



