Wednesday, 23 September 2026
  • Home  
  • సారపాకలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు
- BHADRADRI

సారపాకలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

సారపాక, సెప్టెంబర్‌ 21: బూర్గంపాడు మండలం సారపాకలో మేడే కాలనీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, లాస్య పల్ప్‌ ఇండస్ట్రీ అధినేత ఇంగువ రమేష్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి తనవంతు సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో రవి, సాయి లక్ష్మి, చిన్న, గణేష్‌ రెడ్డి, గద్దల వీరయ్య, హరిబాబు, మోహిత్‌, సీతమ్మ, కుమార్‌, అశోక్‌, శివ, శ్రావణ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక యువకులు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.

సారపాక, సెప్టెంబర్‌ 21: బూర్గంపాడు మండలం సారపాకలో మేడే కాలనీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, లాస్య పల్ప్‌ ఇండస్ట్రీ అధినేత ఇంగువ రమేష్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి తనవంతు సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో రవి, సాయి లక్ష్మి, చిన్న, గణేష్‌ రెడ్డి, గద్దల వీరయ్య, హరిబాబు, మోహిత్‌, సీతమ్మ, కుమార్‌, అశోక్‌, శివ, శ్రావణ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక యువకులు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.