Sunday, 27 September 2026
  • Home  
  • కుబీర్‌లో ప్రశాంతంగా పూర్తయిన కర్ర గణపయ్య నిమజ్జనం
- నిర్మల్

కుబీర్‌లో ప్రశాంతంగా పూర్తయిన కర్ర గణపయ్య నిమజ్జనం

కుబీర్‌లోని విఠలేశ్వర ఆలయంలో కొలువుదీరిన కర్ర గణపయ్య నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా పూర్తయింది. భజన కార్యక్రమాలతో ప్రత్యేక పల్లకిలో గణపయ్యను ఊరేగిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గణపయ్యకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక వాగు వద్దకు చేరుకున్న భక్తులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాగులోని నీటిని గణపయ్యపై చల్లి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కర్ర గణపయ్యను తిరిగి సంప్రదాయబద్ధంగా భద్రపరిచారు. ప్రతీఏటా కర్ర గణపయ్యను నిమజ్జనం చేయకుండా భద్రపరచడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గ్రామస్థుల భక్తి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

కుబీర్‌లోని విఠలేశ్వర ఆలయంలో కొలువుదీరిన కర్ర గణపయ్య నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా పూర్తయింది. భజన కార్యక్రమాలతో ప్రత్యేక పల్లకిలో గణపయ్యను ఊరేగిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు గణపయ్యకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక వాగు వద్దకు చేరుకున్న భక్తులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాగులోని నీటిని గణపయ్యపై చల్లి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం కర్ర గణపయ్యను తిరిగి సంప్రదాయబద్ధంగా భద్రపరిచారు. ప్రతీఏటా కర్ర గణపయ్యను నిమజ్జనం చేయకుండా భద్రపరచడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గ్రామస్థుల భక్తి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.