ఖమ్మం పున్నమి ప్రతి నిధి
జులై
ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసిన 70 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులలోని వాహనదారులకు గౌరవ న్యాయమూర్తి శ్రీమతి బి. నాగలక్ష్మి విచారించి జరిమానా విధించారు.
ఈ కేసుల్లో ప్రతి ఒక్క వాహనదారుడికి 10 వేల చొప్పున మొత్తం 7 లక్షల రూపాయలు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఖమ్మం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ బెల్లం సత్యనారాయణ గారు మాట్లాడుతూ… మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా దృష్టిలో ఉంచుకొని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి, సురక్షితమైన రహదారి ప్రయాణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


