Wednesday, 30 September 2026
  • Home  
  • పేదవారి సొంతింటి కల సాకారం! పెదగంట్యాడలో పట్టాల పండగ.. మహిళల ముఖాల్లో చిరునవ్వులు పెండింగ్ దరఖాస్తులపై దృష్టి.. త్వరలో టిడ్కో ఇళ్ల మంజూరు : పల్లా శ్రీనివాసరావు
- విశాఖపట్నం

పేదవారి సొంతింటి కల సాకారం! పెదగంట్యాడలో పట్టాల పండగ.. మహిళల ముఖాల్లో చిరునవ్వులు పెండింగ్ దరఖాస్తులపై దృష్టి.. త్వరలో టిడ్కో ఇళ్ల మంజూరు : పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి): పెదగంట్యాడలో పేదల సొంతింటి కల సాకారమైంది. 64, 65, 74 వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్‌ఆర్, ప్రభుత్వ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు, ముఖ్యంగా మహిళలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నెల 19న ఇంజినీరింగ్ కళాశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు 29 వేల మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మరోవైపు త్వరలో టిడ్కో ఇళ్లను కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. గాజువాక నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి త్వరితగతిన పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు పులి రమణారెడ్డి, ములకలపల్లి వెంకటయ్య, మొల్లి పెంటిరాజు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం, సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి): పెదగంట్యాడలో పేదల సొంతింటి కల సాకారమైంది. 64, 65, 74 వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్‌ఆర్, ప్రభుత్వ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు, ముఖ్యంగా మహిళలకు ఇళ్ల పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నెల 19న ఇంజినీరింగ్ కళాశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు 29 వేల మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

మరోవైపు త్వరలో టిడ్కో ఇళ్లను కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. గాజువాక నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి త్వరితగతిన పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు పులి రమణారెడ్డి, ములకలపల్లి వెంకటయ్య, మొల్లి పెంటిరాజు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.