హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో నిర్వహించిన ఐకాన్ మహాబలిజ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎద్దుల విజయసాగర్ మాట్లాడుతూ సభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రంగనాథ్‌తో పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. సభలో రంగనాథ్ యువతకు చక్కటి సందేశాన్ని అందించారని విజయసాగర్ తెలిపారు.


