అనంతగిరి గిరిజన బాలికల పాఠశాల-2లో జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం బి. మంగమ్మ సమక్షంలో డా. చంద్రకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డా. చంద్రకాంత్ నులిపురుగుల నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు. నులిపురుగుల వల్ల కలిగే వ్యాధి లక్షణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను స్వయంగా మింగించారు. విద్యార్థులు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డా.చంద్ర కాంత్,పిహెచ్ఎన్,వెంకట లక్ష్మి,సూర్య రావు, దోయిమోతి,లక్ష్మి, సుందరి,పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



