డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ పెద్ద అంజోడ గ్రామంలో సోమవారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి డా. సియ్యారి దొన్నుదొర ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో గిరిజన ప్రాంత అభివృద్ధికి పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని కోరారు. రైతుల వద్దకే అధికారులు వచ్చి పాస్‌పుస్తకాలు అందించడం మార్పుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి శెట్టి చిరంజీవి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్ధానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి: దొన్నుదొర