Friday, 3 July 2026
  • Home  
  • దిశ కమిటీలో సేవామూర్తికి చోటు పల్నాడు జిల్లా సభ్యుడిగా మెట్టు గోవిందరెడ్డి
- ఆంధ్రప్రదేశ్

దిశ కమిటీలో సేవామూర్తికి చోటు పల్నాడు జిల్లా సభ్యుడిగా మెట్టు గోవిందరెడ్డి

లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికా శుక్లా సిఫార్సుతో నియామకం. జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తానన్న గోవిందరెడ్డి మాచర్ల, జూలై 04 (పున్నమి ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించే పల్నాడు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ, దిశ అనధికార సభ్యుడిగా ప్రముఖ సామాజిక సేవకుడు మెట్టు గోవిందరెడ్డి నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆయన గురువారం అందుకున్నారు.కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ప్రతి జిల్లాలో దిశ కమిటీని ఏర్పాటు చేస్తారు. స్థానిక ఎంపీ చైర్మన్‌గా, కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా ఉండే ఈ కమిటీ కేంద్ర పథకాల అమలు, నిధుల వినియోగంపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. దిశ మార్గదర్శకాల ప్రకారం ప్రఖ్యాత సేవా సంస్థల నుంచి ఒకరిని అనధికార సభ్యుడిగా నామినేట్ చేసే అధికారం చైర్మన్‌కు ఉంది. శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడిగా, స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్‌గా మెట్టు గోవిందరెడ్డి చేస్తున్న సేవలను గుర్తించిన నరసరావుపేట ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికా శుక్లా ఆయన పేరును దిశ కమిటీకి ప్రతిపాదించారు.ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ, “నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి, కలెక్టర్ కృతికా శుక్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేరేలా వారధిగా ఉంటాను. జిల్లా సమగ్ర అభివృద్ధికి నా అనుభవాన్ని ఉపయోగిస్తాను” అని స్పష్టం చేశారు.గోవిందరెడ్డి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. రిటైర్డ్ హెచ్‌ఎం అందుగుల చంద్రయ్య, ముత్యాల పాపిరెడ్డి, పి. హరిబాబు, పి. శ్రీనివాస్, ఎర్రబాతుల నాగ శంకర్ రెడ్డి, సత్యనారాయణ రాజు, సిహెచ్. రుక్మిణి, వై. సైదమ్మ, ఆర్టీసీ రాయప్ప తదితర ప్రముఖులు, శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు ఆయనను అభినందించారు. సేవా రంగంలో ఆయన కృషికి ఇది సరైన గుర్తింపు అని కొనియాడారు.

లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికా శుక్లా సిఫార్సుతో నియామకం.
జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తానన్న గోవిందరెడ్డి

మాచర్ల, జూలై 04 (పున్నమి ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించే పల్నాడు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ, దిశ అనధికార సభ్యుడిగా ప్రముఖ సామాజిక సేవకుడు మెట్టు గోవిందరెడ్డి నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆయన గురువారం అందుకున్నారు.కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ప్రతి జిల్లాలో దిశ కమిటీని ఏర్పాటు చేస్తారు. స్థానిక ఎంపీ చైర్మన్‌గా, కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా ఉండే ఈ కమిటీ కేంద్ర పథకాల అమలు, నిధుల వినియోగంపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. దిశ మార్గదర్శకాల ప్రకారం ప్రఖ్యాత సేవా సంస్థల నుంచి ఒకరిని అనధికార సభ్యుడిగా నామినేట్ చేసే అధికారం చైర్మన్‌కు ఉంది. శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడిగా, స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్‌గా మెట్టు గోవిందరెడ్డి చేస్తున్న సేవలను గుర్తించిన నరసరావుపేట ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికా శుక్లా ఆయన పేరును దిశ కమిటీకి ప్రతిపాదించారు.ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ, “నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి, కలెక్టర్ కృతికా శుక్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేరేలా వారధిగా ఉంటాను. జిల్లా సమగ్ర అభివృద్ధికి నా అనుభవాన్ని ఉపయోగిస్తాను” అని స్పష్టం చేశారు.గోవిందరెడ్డి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. రిటైర్డ్ హెచ్‌ఎం అందుగుల చంద్రయ్య, ముత్యాల పాపిరెడ్డి, పి. హరిబాబు, పి. శ్రీనివాస్, ఎర్రబాతుల నాగ శంకర్ రెడ్డి, సత్యనారాయణ రాజు, సిహెచ్. రుక్మిణి, వై. సైదమ్మ, ఆర్టీసీ రాయప్ప తదితర ప్రముఖులు, శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు ఆయనను అభినందించారు. సేవా రంగంలో ఆయన కృషికి ఇది సరైన గుర్తింపు అని కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.