Friday, 3 July 2026
  • Home  
  • బీఎల్ఏల సమన్వయంతో ‘ఎస్‌ఐఆర్’ను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే జూలకంటి
- పల్నాడు

బీఎల్ఏల సమన్వయంతో ‘ఎస్‌ఐఆర్’ను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే జూలకంటి

అధికారులు, కూటమి నేతలతో ఎమ్మెల్యే సమీక్ష. పరాశక్తి ఫ్యాక్టరీలో నాన్-లోకల్స్ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం రెంటచింతల, జూలై 04( పున్నమి ప్రతినిధి): బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ, ఎస్‌ఐఆర్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, కూటమి పార్టీల నాయకులతో ఆయన విడివిడిగా సమీక్ష నిర్వహించారు.మండల పరిధిలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ఏ మేరకు జరుగుతోంది, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బూత్‌లోనూ బీఎల్ఓ, బీఎల్ఏలు కలిసి ఇంటింటి సర్వే చేయాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, చిరునామా మార్పులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.పరాశక్తి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నాన్-లోకల్, లోకల్ కార్మికుల వివరాలను క్షుణ్ణంగా విచారించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. “అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి. అదే సమయంలో డూప్లికేట్, బోగస్ ఓట్లు లేకుండా చూడాలి. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించండి” అని తహశీల్దార్‌కు సూచించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలి. రాజకీయ పార్టీల బీఎల్ఏల సహకారం తీసుకోండి. ఎలాంటి ఫిర్యాదులకు తావివ్వకుండా పని పూర్తి చేయడం మనందరి బాధ్యత” అని ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు.ఈ సమీక్షలో తహశీల్దార్ ఎం.దీప్తి, ఎంపీడీవో స్వరూపా రాణి, టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, నాయకులు గొంటు సుమంత్ రెడ్డి, మున్నా ప్రభురాజు, బోడపాటి రామకృష్ణ, పలువురు బీఎల్ఓలు, కూటమి పార్టీల బీఎల్ఏలు పాల్గొన్నారు.

అధికారులు, కూటమి నేతలతో ఎమ్మెల్యే సమీక్ష. పరాశక్తి ఫ్యాక్టరీలో నాన్-లోకల్స్ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం

రెంటచింతల, జూలై 04( పున్నమి ప్రతినిధి): బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ, ఎస్‌ఐఆర్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, కూటమి పార్టీల నాయకులతో ఆయన విడివిడిగా సమీక్ష నిర్వహించారు.మండల పరిధిలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ఏ మేరకు జరుగుతోంది, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బూత్‌లోనూ బీఎల్ఓ, బీఎల్ఏలు కలిసి ఇంటింటి సర్వే చేయాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, చిరునామా మార్పులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.పరాశక్తి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నాన్-లోకల్, లోకల్ కార్మికుల వివరాలను క్షుణ్ణంగా విచారించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. “అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి. అదే సమయంలో డూప్లికేట్, బోగస్ ఓట్లు లేకుండా చూడాలి. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించండి” అని తహశీల్దార్‌కు సూచించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలి. రాజకీయ పార్టీల బీఎల్ఏల సహకారం తీసుకోండి. ఎలాంటి ఫిర్యాదులకు తావివ్వకుండా పని పూర్తి చేయడం మనందరి బాధ్యత” అని ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు.ఈ సమీక్షలో తహశీల్దార్ ఎం.దీప్తి, ఎంపీడీవో స్వరూపా రాణి, టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, నాయకులు గొంటు సుమంత్ రెడ్డి, మున్నా ప్రభురాజు, బోడపాటి రామకృష్ణ, పలువురు బీఎల్ఓలు, కూటమి పార్టీల బీఎల్ఏలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.