Friday, 2 October 2026
  • Home  
  • ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ సమగ్ర అభివృద్ధి భూమయ్యగారిపల్లి గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై విస్తృత చర్చ
- కడప

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ సమగ్ర అభివృద్ధి భూమయ్యగారిపల్లి గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై విస్తృత చర్చ

(పున్నమి ప్రతినిధి) వేముల మండలం, అక్టోబర్ 2: గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని వెలుగు–డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (APM) ఆంజనేయులు పేర్కొన్నారు. భూమయ్యగారిపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో GPDP, మహిళా రక్షణ, మహిళల భద్రత, బాల్యవివాహాల నిరోధం, బాల కార్మికుల నిర్మూలన, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, మౌలిక వసతులపై ప్రజలతో చర్చించారు. గ్రామ సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, బ్యాంకు లింకేజీ రుణాలు, జీవనోపాధి రుణాలు, మహిళా ఎంటర్‌ప్రైజెస్, ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. రుణాలను ఉత్పాదక జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించి స్థిరమైన ఆదాయం పొందాలని తెలిపారు. ప్రతి కుటుంబంలో కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్ ఏర్పాటు ద్వారా తాజా కూరగాయలు అందుబాటులోకి రావడంతో పాటు పోషకాహార భద్రత మెరుగుపడుతుందని వివరించారు. లక్‌పతి దీదీలు తమ జీవనోపాధి కార్యక్రమాల ద్వారా సాధించిన పురోగతి, ఆదాయ వృద్ధి, అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. వారి విజయగాథలు మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రజల సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. “ప్రజల మాట – గ్రామ అభివృద్ధికి బాట” అనే సందేశంతో గ్రామ సభలో ప్రజల చురుకైన భాగస్వామ్యం అవసరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ రంగయ్య, పంచాయతీ సెక్రటరీ లక్ష్మి దేవి, గ్రామ సమాఖ్య అధ్యక్షులు, వెలుగు–డీఆర్‌డీఏ CC జయపాల్, గ్రామ సమాఖ్య అసిస్టెంట్లు, డ్వాక్రా మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

(పున్నమి ప్రతినిధి)
వేముల మండలం, అక్టోబర్ 2:
గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని వెలుగు–డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (APM) ఆంజనేయులు పేర్కొన్నారు. భూమయ్యగారిపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో GPDP, మహిళా రక్షణ, మహిళల భద్రత, బాల్యవివాహాల నిరోధం, బాల కార్మికుల నిర్మూలన, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, మౌలిక వసతులపై ప్రజలతో చర్చించారు. గ్రామ సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, బ్యాంకు లింకేజీ రుణాలు, జీవనోపాధి రుణాలు, మహిళా ఎంటర్‌ప్రైజెస్, ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. రుణాలను ఉత్పాదక జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించి స్థిరమైన ఆదాయం పొందాలని తెలిపారు.

ప్రతి కుటుంబంలో కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్ ఏర్పాటు ద్వారా తాజా కూరగాయలు అందుబాటులోకి రావడంతో పాటు పోషకాహార భద్రత మెరుగుపడుతుందని వివరించారు. లక్‌పతి దీదీలు తమ జీవనోపాధి కార్యక్రమాల ద్వారా సాధించిన పురోగతి, ఆదాయ వృద్ధి, అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. వారి విజయగాథలు మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రజల సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. “ప్రజల మాట – గ్రామ అభివృద్ధికి బాట” అనే సందేశంతో గ్రామ సభలో ప్రజల చురుకైన భాగస్వామ్యం అవసరమని అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ రంగయ్య, పంచాయతీ సెక్రటరీ లక్ష్మి దేవి, గ్రామ సమాఖ్య అధ్యక్షులు, వెలుగు–డీఆర్‌డీఏ CC జయపాల్, గ్రామ సమాఖ్య అసిస్టెంట్లు, డ్వాక్రా మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.