మార్కాపురం జిల్లా నూతన ఎస్పీ గా పంకజ్ కుమార్ మీనా
మార్కాపురం జిల్లాకు నూతన ఎస్పీ గా పంకజ్ కుమార్ మీనా గురువారం బాధ్యతలు స్వీకరించారు, అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత తదితర అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పోలీసు యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనాకు కలెక్టర్ విజయ సునీత శుభాకాంక్షలు తెలిపారు.
Uploaded Video:


