నంద్యాల: స్థానిక శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ‘శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ స్థాయి నంది నృత్య పోటీలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యక్రమానికి ప్రముఖ కూచిపూడి నాట్యగురువు డా. వేదాంతం రాధేశ్యామ్ న్యాయనిర్ణేతగా, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డా. జి. రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూచిపూడి, భరతనాట్యం, జానపద విభాగాల్లో వివిధ నాట్యగురువుల శిష్యులు ప్రతిభ చాటగా.. విజేతలకు ‘నంది’ మెమోంటోలతో సన్మానించినట్లు సంస్థ నిర్వాహకులు డా. పల్లెంశెట్టి సురేష్ తెలిపారు.

విజయవంతంగా ముగిసిన 9వ జాతీయ స్థాయి నంది నృత్య పోటీలు
నంద్యాల: స్థానిక శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ‘శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ స్థాయి నంది నృత్య పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ కూచిపూడి నాట్యగురువు డా. వేదాంతం రాధేశ్యామ్ న్యాయనిర్ణేతగా, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డా. జి. రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూచిపూడి, భరతనాట్యం, జానపద విభాగాల్లో వివిధ నాట్యగురువుల శిష్యులు ప్రతిభ చాటగా.. విజేతలకు ‘నంది’ మెమోంటోలతో సన్మానించినట్లు సంస్థ నిర్వాహకులు డా. పల్లెంశెట్టి సురేష్ తెలిపారు.

