*అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పది.*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 21 వాకాడు మండలం,,*
అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పదని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
సోమవారం మండల కేంద్రమైన వాకాడు లోని శివాలయం సమీపంలో ఉన్న గిరిజన కాలనీలో ఉచిత కంటివైద్య శిబిరాన్ని ఎం వి రావు ఫౌండేషన్ వారు నిర్వహించగా ముందుగా వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి చిత్రపటాలకు వాకాడు ఐసిడిఎస్ సూపర్వైజర్ బుజ్జమ్మ, వాకాడు ముస్లిం వీధి ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాలాది కిషోర్ పూలమాలవేసి జ్యోతి ప్రజలవన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
కోట పట్నానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్యనిపుణులు డాక్టర్ వి రమేష్ శిబిరానికి హాజరైన గిరిజన ప్రాంత ప్రజలకు కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు.
ముందుగా జాలాది కిషోర్ బుజ్జమ్మలకు అనంతరం గ్రామ ప్రజలకు కంప్యూటర్ పరీక్షలు నిర్వహించి వారిలో దృష్టిలో ఉన్న వారిని గుర్తించారు.
కంటి అద్దాలు అవసరమైన వారికి కంటి అద్దాలు,
కంటిలో శుక్లాలు పొరలు ఉన్నవారికి తిరుపతి వాసన్ ఐ కేర్ ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ శిబిరంలో వాకాడు పంచాయతీ ప్రజలు విరివిగా పాల్గొని కంటి సమస్యల గురించి డాక్టర్ వి రమేష్ ఆధ్వర్యంలో కంప్యూటర్ పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి ప్రధానోపాధ్యాయులు జాలాది కిషోర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ బుజ్జమ్మ మరియు అంగన్వాడీ సిబ్బంది స్థానిక గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.



