Monday, 28 September 2026
  • Home  
  • నంద్యాలలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం
- నంద్యాల

నంద్యాలలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

నంద్యాల: నంద్యాల కలెక్టరేట్‌లోని PGRS హాలులో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి సునీల్ కన్నా, సోషల్ వెల్ఫేర్ అధికారి శివారెడ్డిలతో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల చరిత్ర, విశిష్టతలను విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత పాటిస్తూ ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పర్యాటకం పెరిగితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.జిల్లా పర్యాటక శాఖ అధికారి సునీల్ కన్నా మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 28 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. పర్యాటకరంగ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే శ్రీశైలంలో అందుబాటులో ఉన్న రోప్‌వే సౌకర్యంతో పాటు యాగంటి, అహోబిలం క్షేత్రాలలోనూ కొత్తగా రోప్‌వే ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నంద్యాల: నంద్యాల కలెక్టరేట్‌లోని PGRS హాలులో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి సునీల్ కన్నా, సోషల్ వెల్ఫేర్ అధికారి శివారెడ్డిలతో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల చరిత్ర, విశిష్టతలను విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత పాటిస్తూ ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పర్యాటకం పెరిగితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.జిల్లా పర్యాటక శాఖ అధికారి సునీల్ కన్నా మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 28 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. పర్యాటకరంగ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే శ్రీశైలంలో అందుబాటులో ఉన్న రోప్‌వే సౌకర్యంతో పాటు యాగంటి, అహోబిలం క్షేత్రాలలోనూ కొత్తగా రోప్‌వే ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.