డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ విచారణ కోరుతూ చేపట్టిన వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలపై జరిగిన ఘటనలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులతో సమావేశమైన జగన్, నిరసన కార్యక్రమాల సందర్భంగా తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై కూడా జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతున్నందుకే తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. బెదిరింపులకు వెనకడుగు వేసేది లేదని, డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే వరకు పోరాటం కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు.

డీఎస్సీపై పోరాటం ఆగదు: వైఎస్ జగన్