Thursday, 24 September 2026
  • Home  
  • ఘనంగా తెలుగు భాషా దినోత్సవం జి.వి.ఆర్.ఆర్ కళాశాల నెల్లూరు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం జి.వి.ఆర్.ఆర్ కళాశాల నెల్లూరు

జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో నేడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని *తెలుగు భాషా దినోత్సవాన్ని* ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షునిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ AB రవి కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు తెలుగు భాష మీద ఎక్కువ పట్టు సాధించాలని,తెలుగు కవులు,రచయిత్రులు పేర్లు తెలుసుకోవాలని, ఇతర భాషల పట్ల గౌరవం,మన భాషను నిత్యము సంభాషించడం,ఎంతో నేర్పు కలిగి ఉండాలని తెలియజేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె.వి సత్యనారాయణ గారు తెలుగు ఉపన్యాసకులు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నాయుడుపేట వారు మాట్లాడుతూ అభ్యుదయ కవి తెలుగు భాషా పండితులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జీవిత విషయాలని పిల్లలకు అర్థమయ్యేలా ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. తెలుగు భాష కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారిని స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాషా సంస్కరణోద్యమానికి గొప్ప కృషి చేశారు. అప్పట్లో పండితుల భాషగా ఉన్న గ్రాంథిక తెలుగును సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి ఆయన కృషి చేశారు. ప్రజలు మాట్లాడే వ్యావహారిక భాషలోనే విద్య, రచనలు ఉండాలని ఆయన బలంగా కోరారు. “.మరొక విశిష్ట అతిధి డికె ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల, నెల్లూరు జూనియర్ లెక్చరర్ తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ మర్రి వెంకట్రావు గారు మాట్లాడుతూ ప్రజల భాషే నిజమైన భాష” అనే భావనతో ఆయన తెలుగు భాషను ప్రజలకు మరింత దగ్గర చేశారు. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే భాషలో విద్య అందించడానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనకు తెలుగు భాషను ప్రేమించాలి, గౌరవించాలి, మన దైనందిన జీవితంలో చక్కగా ఉపయోగించాలి అనే సందేశాన్ని ఇస్తుంది. మన మాతృభాష తెలుగు. తెలుగు మాట్లాడటం మన గౌరవం. తెలుగు చదవడం మన బాధ్యత. తెలుగును కాపాడటం మనందరి కర్తవ్యం. గిడుగు రామమూర్తి పంతులు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. జై తెలుగు! ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు

జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో నేడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని *తెలుగు భాషా దినోత్సవాన్ని* ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షునిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ AB రవి కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు తెలుగు భాష మీద ఎక్కువ పట్టు సాధించాలని,తెలుగు కవులు,రచయిత్రులు పేర్లు తెలుసుకోవాలని, ఇతర భాషల పట్ల గౌరవం,మన భాషను నిత్యము సంభాషించడం,ఎంతో నేర్పు కలిగి ఉండాలని తెలియజేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె.వి సత్యనారాయణ గారు తెలుగు ఉపన్యాసకులు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నాయుడుపేట వారు మాట్లాడుతూ అభ్యుదయ కవి తెలుగు భాషా పండితులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జీవిత విషయాలని పిల్లలకు అర్థమయ్యేలా ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. తెలుగు భాష కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారిని స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను.
గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాషా సంస్కరణోద్యమానికి గొప్ప కృషి చేశారు. అప్పట్లో పండితుల భాషగా ఉన్న గ్రాంథిక తెలుగును సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి ఆయన కృషి చేశారు. ప్రజలు మాట్లాడే వ్యావహారిక భాషలోనే విద్య, రచనలు ఉండాలని ఆయన బలంగా కోరారు.
“.మరొక విశిష్ట అతిధి డికె ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల, నెల్లూరు జూనియర్ లెక్చరర్ తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ మర్రి వెంకట్రావు గారు మాట్లాడుతూ ప్రజల భాషే నిజమైన భాష” అనే భావనతో ఆయన తెలుగు భాషను ప్రజలకు మరింత దగ్గర చేశారు. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే భాషలో విద్య అందించడానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది.
ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనకు తెలుగు భాషను ప్రేమించాలి, గౌరవించాలి, మన దైనందిన జీవితంలో చక్కగా ఉపయోగించాలి అనే సందేశాన్ని ఇస్తుంది.
మన మాతృభాష తెలుగు.
తెలుగు మాట్లాడటం మన గౌరవం.
తెలుగు చదవడం మన బాధ్యత.
తెలుగును కాపాడటం మనందరి కర్తవ్యం.
గిడుగు రామమూర్తి పంతులు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
జై తెలుగు! ఈ కార్యక్రమంలో
అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.