Friday, 3 July 2026
  • Home  
  • సేవకు గుర్తింపు దిశగా జనసేన.. ఎలమంచిలి మండల అధ్యక్ష పదవికి అన్నం బాబ్జి దరఖాస్తు..!
- అనకాపల్లి

సేవకు గుర్తింపు దిశగా జనసేన.. ఎలమంచిలి మండల అధ్యక్ష పదవికి అన్నం బాబ్జి దరఖాస్తు..!

అనకాపల్లి జిల్లా, జూలై 3 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన పదవుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా గురువారం అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎలమంచిలి మండలంలోని ఏటికొప్పాక గ్రామానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి ఎలమంచిలి మండల అధ్యక్ష పదవికి తన దరఖాస్తును అధికారికంగా సమర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన సిద్ధాంతాల ప్రచారం, ప్రజా సమస్యలపై పోరాటం, సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న అన్నం బాబ్జి సేవలను పార్టీ శ్రేణులు ప్రశంసిస్తున్నాయి. గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణకు, యువతను జనసేన వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నం బాబ్జి మాట్లాడుతూ, పార్టీ తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పిస్తే ఎలమంచిలి మండలంలో జనసేనను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అనకాపల్లి జిల్లా, జూలై 3 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన పదవుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా గురువారం అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎలమంచిలి మండలంలోని ఏటికొప్పాక గ్రామానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి ఎలమంచిలి మండల అధ్యక్ష పదవికి తన దరఖాస్తును అధికారికంగా సమర్పించారు.
పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన సిద్ధాంతాల ప్రచారం, ప్రజా సమస్యలపై పోరాటం, సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న అన్నం బాబ్జి సేవలను పార్టీ శ్రేణులు ప్రశంసిస్తున్నాయి. గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణకు, యువతను జనసేన వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అన్నం బాబ్జి మాట్లాడుతూ, పార్టీ తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పిస్తే ఎలమంచిలి మండలంలో జనసేనను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.