వెంకటగిరి సెప్టెంబరు 19 : పట్టణంలోని వెంకటగిరి ఆర్.వి.యం హైస్కూల్ నందు మనబడి- మన మిత్రులు అనే కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులచే పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి అందచేయడం జరిగింది. శనివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు సుంకర రవి మాట్లాడుతూ విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు. మనిషిలో ఉన్న సంపూర్ణ జ్ఞానాన్ని వెలికితీయడమే నిజమైన విద్య అని, ఏకాగ్రతతో చదివితే విద్య సులభం అవుతుంది. తద్వారా విద్ధ్యార్దులు పరీక్షల్లో సులభంగా విజయం సాధించగలరని రవి పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు, పెన్నులు, వ్యక్తిత్వ వికాసం, పెంచే స్వామి వివేకానంద జీవితం-సందేశం అనే పుస్తకాలను పంచారు. ఈ కార్యక్రమంలో గుమ్మళ్లపు ఢిల్లీబాబు, నర్రా రవి ,మన్నెం సుబ్బారావు, అడపాల మురళి, నర్రా విజయ్ కుమార్, తిరుమల శెట్టి వల్లభ దాసు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఏకాగ్రత ముఖ్యం