Tuesday, 29 September 2026
  • Home  
  • హాస్టల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హాస్టల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 28(పున్నమి ప్రతినిధి) మనుబోలు: మండల కేంద్రంలోని ఎస్సీ బాలబాలికల వసతి గృహాలను ఏఎన్డబ్ల్యూవో సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు, తువ్వాళ్లు, ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఎస్ఏ-2 పరీక్షల్లో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 28(పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మండల కేంద్రంలోని ఎస్సీ బాలబాలికల వసతి గృహాలను ఏఎన్డబ్ల్యూవో సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు, తువ్వాళ్లు, ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఎస్ఏ-2 పరీక్షల్లో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.