సారపాక, సెప్టెంబర్ 19: బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్లో వడ్డెర సంఘం, అజయ్ యూత్
ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, లాస్య పల్ప్ ఇండస్ట్రీ అధినేత ఇంగువ రమేష్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహాయాన్ని అందించారు. ఉత్సవాల్లో స్థానిక నాయకులు, యువకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.



